calender_icon.png 16 April, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక మార్గంతోనే ప్రశాంతత

15-04-2025 12:24:48 AM

అయ్యప్ప స్వామి ఆలయంలో విష్ణు పూజలో పాల్గొన్న ఎంపీ నగేష్,  ఎమ్మెల్యే శంకర్

ఆదిలాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : అదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన విష్ణు పూజలో బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. కేరళ సాం ప్రదాయంలో భాగంగా నిర్వహించిన విష్ణు పూజలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొని అయ్య ప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ప్రధాన పూజారి సంతోష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  కౌట ప్రభాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిల భజన బృందం పడిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అయ్యప్ప దీక్షలు ఎంతో కఠోరమైన దీక్షలని వాటిని నియమనిష్టలతో చేపట్టడం జరుగుతోందన్నారు.

ప్రస్తుత మనిషి యాంత్రిక జీవితం లో ఆధ్యాత్మికత మార్గం ద్వారానే ప్రశాంతత నెలకొంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఆలయ గౌరవ అధ్యక్షులు దారుట్ల జీవన్, ప్రధాన కార్యదర్శి దాముక రవి, నరేష్, గురుస్వాములు గణేష్, మహేందర్, విజయ్, సుబ్బ న్న, అన్నోజుల శ్రీనివాస్, మోహన్, లక్ష్మణ్, యువరాజ్, తోట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.