calender_icon.png 24 February, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక మార్గంతోనే ప్రశాంతత

24-02-2025 12:01:05 AM

మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): ఆధ్యాత్మిక మార్గంతో శాంతి స్థాపనతో పాటు మానసిక ప్రశాంతత నెలకొంటుదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపాల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గ్రామస్తులు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండ్రత్ రమేష్, కొండ గణేష్, బట్టు సతీష్,దేవుదాష్ కుమ్రా రాజు,ఉగ్గే విట్టల్, తదితరులు పాల్గొన్నారు.