- చర్చలతోనే ఘర్షణలకు ముగింపు పలకగలం
- పుతిన్‌కు ప్రధాని మోదీ సూచన
- మోదీ రష్యా పర్యటనపై జెలెన్‌స్కీ అసంతృప్తి
మాస్కో, జూలై 9: రష్యా, ఉక్రెయిన్ యు ద్ధానికి ముగింపు పలకాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. శాంతి చర్చలతో పరిస్థితులను ప్రజలకు అనుకూలంగా మార్చాలని కోరారు. బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో శాంతి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. భారత్ ఎప్పు డూ శాంతి వైపే ఉంటుందని, అదే సమయం లో రష్యాతో ద్వైపాక్షిక బంధానికి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతి న్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో మోదీ పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాల నేతలు పాల్గొన్నారు. పుతిన్‌తో మోదీ మంగళవారం సమావేశమయ్యారు. భవిష్య త్తు కోసం శాంతియుత వాతావరణం చాలా అవసరమని, ఇందుకోసం భారత్ అన్ని విధా లుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. గత ఐదేళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, కొవిడ్‌తోపాటు పలు దేశాల మధ్య సంఘర్షణలు పెరిగాయని గుర్తు చేశారు.
బంధం మరింత దృఢం
రాబోయే రోజుల్లో భారత్, రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్వసిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య సహకారం ప్రపంచానికి సైతం సాయపడిందని పేర్కొన్నారు. భారత్ 4 దశాబ్దాలుగా తీవ్రవాద సవాలును ఎదుర్కొంటోందని తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఆర్థిక మాం ద్యం తలెత్తినప్పుడు ప్రపంచం ఆహారం, ఇంధ నం, ఎరువుల కొరతను ఎదుర్కొందని, భారత్ మాత్రం అందుకు భిన్నంగా దృఢంగా మారిందన్నారు. అందుకు ఓ రకంగా రష్యా కారణ మని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రష్యాతో సంబంధాలను మరింత విస్తరించాల ని భావించినట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో ఘర్షణ విషయంలోనూ శాంతి పునరుద్ధరణ లక్ష్యంగా భారత్ అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.
మోదీకి అత్యున్నత పురస్కారం
మోదీకి 2019లో ప్రకటించిన రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్‌ను మంగళవారం లాంఛనంగా అందజేశారు. రష్యా, భార త్ మధ్య విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య ం, స్నేహపూర్వక సంబంధాల అభివృద్ధికి విశిష్ఠ సహకారం అందించినందుకు గాను ఈ అవార్డును ప్రటించారు. అత్యుత్తమ పౌర లేదా సైనిక సేవ చేసిన వారికి అందజేస్తారు.
భారతీయులకు విముక్తి
అక్రమమార్గాల ద్వారా రష్యా వెళ్లి అక్కడ ఆర్మీ వద్ద చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారు. వారంతా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నా రు. వీరిని విడుదల చేయాలంటూ పుతిన్‌ను మోదీ కోరారు. అందుకు పుతిన్ సానుకూలంగా స్పందించా రు. వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
జెలెన్‌స్కీ ఆగ్రహం
పుతిన్‌తో మోదీ భేటీ తమ శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ అంటూ వ్యా ఖ్యాని ంచారు. మోదీ పర్యటన తమను తీవ్రంగా నిరాశ పరిచిందని పేర్కొన్నారు.
పదేళ్లలో అసలైన సినిమా
రష్యా పర్యటనలో భాగంగా ప్రవా స భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ప్రపంచ అభివృద్ధిలో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యాకు తాను ఒక్కడినే రాలే దని, 140 కోట్ల మంది ప్రేమను, భా రత మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. దీంతో సమావేశ మందిరమ ంతా చప్పట్లతో మార్మోగిపోయింది. మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించా. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూ డో స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చే స్తా. భారత్ విజయాలను చూసి చాలా దేశాలు గర్విస్తున్నాయి. రాబోయే పదేళ్లలో అసలైన సినిమా చూపిస్తాం అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.