calender_icon.png 19 January, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి మార్గంతోనే గ్రామాల్లో ప్రశాంతత

18-01-2025 06:29:28 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి మార్గంతోనే గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుంది మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తన స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయి గూడ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత ను పెంపొందించుకుంటూ భక్తి మార్గంలో నడవడంతో మానసిక ప్రశాంతత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుల్లి గంగన్న, లోక కృష్ణారెడ్డి, మాధస్తు రాజన్న, దేవర్తి గణేష్, అశోక్, రాజన్న, గండ్రత్ రమేష్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లద్, రాజన్న, జగదీష్, సతీష్, పవన్ నాయక్, కొడప తిరుపతి, దమ్మపాల్, కొండ గణేష్, ఉగ్గే విట్టాల్, తదితరులు పాల్గొన్నారు.