calender_icon.png 28 October, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల వల్లే ఆశాంతి

28-10-2024 12:44:14 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి):  ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో  అశాంతిని రగలించింది ఎవరని కాంగ్రెస్ నాయకులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ డిజిటల్ సర్వే పేరుతో వ్యవసాయ శాఖకు చెందిన ఏఈవోల మీద వేటు, పనిభారం మీద ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు వేశారని, కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు, రేవంత్‌రెడ్డి అనాలోచిత విధానాలేనని అశాంతి ఏర్ప డడానికి కారణమని మండిపడ్డారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లాయే అని ఇప్పుడు తెలంగాణలోని ప్రతిఒకరు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వమే కైటెక్స్ తీసుకొచ్చింది  

 వరంగల్‌కు వస్త్ర వైభవం తిరిగి తెచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కాకతీయ కైటెక్స్ చేపట్టిన మహత్తర కార్యమని కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల తలరాత మార్చేందుకు తీసు కున్న ఒక మెగా సంకల్పమన్నారు.  పట్టుదలతో రాష్ట్రానికి పట్టుకొచ్చిన భారీ పెట్టుబడి కైటెక్స్ అన్నారు.

ప్ర పంచస్దాయి సంస్థలను ఒప్పించి, రప్పించి కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్ ను కళకళలాడించేందుకు చేసిన కృషి ఫలాలని పేర్కొన్నారు. ఫైబర్ టు ఫ్యాషన్ స్లోగన్‌తో వలసలు వాపస్ వచ్చేలా ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా వస్త్ర నగరని తీర్చిదిద్దటానికి చేయని ప్రయత్నాలు లేవన్నారు. కేంద్ర సహ కారం ఏమాత్రం లేకున్నా, సొంత నిధులతో ముందుడుగు వేసినట్లు తెలిపారు.