calender_icon.png 9 January, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలు క్షీణించాయి

31-12-2024 02:34:10 AM

  1. రాజకీయ కక్షలకు వేదికగా పోలీసులు
  2. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటైన ఏడాదిలోనే శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్ ఆరోపించారు. తమ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రత ల విషయంలో కేసీఆర్ రూ.700కోట్ల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. జగిత్యాల పెట్రోల్ బంక్‌లో పోలీసులపై కాంగ్రెసోళ్లు దాడి చేస్తే కూడా కేసు పెట్టలేని పరిస్థితి దాపురించిందన్నా రు. సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఎస్పీ కేసు నమోదు చేశారని విమర్శించారు.

తెలంగాణ పోలీస్ అంటే రాజకీయ కక్షలకు వేదిక అయ్యిందన్నారు. పోలీసుల ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం సొంత గ్రామంలో రుణమాఫీపై ఆరా తీసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడి చేయడ మే కాకుండా వారిపైనే కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ అంతర భద్రతలో స్పెషల్ పోలీసులను తొలగించి ఏఆర్ సిబ్బందిని ఎందుకు పెట్టారని నిలదీశారు.