calender_icon.png 18 January, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలే లక్ష్యం

18-01-2025 01:59:12 AM

డీజీపీ జితేందర్

మహబూబ్ నగర్, జనవరి 17 (విజయ క్రాంతి): ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించేందుకుగాను నేరాల నివార ణ, శాంతి భద్రతలే మన లక్ష్యమని రాష్ర్ట డిజిపి జితేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ డా. జితేందర్ మహబూబ్‌నగర్, నారాయ ణపేట జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

ఈ సమీక్ష సమీక్షా సమావేశం నందు నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాసేవల పరంగా పోలీసుల విధులు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పోలీసు ప్రధాన కార్యాల యం నందు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం చేశారు.

ఈ సందర్భంగా డిజిపి విలేకరులతో మాట్లాడారు ప్రశాంత మైన వాతావరణం నెలకొల్పేందుకు పోలీ సులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నా రు. ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించ బడిందని, జిల్లాలో నేరాల పర్యవేక్షణ, అత్య వసర సమయాల్లో వేగవంతమైన స్పంద నకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, మరియు ఇతర సాంకేతిక పరికరాలు పర్యవేక్షించబడతా యని తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధాలను మెరుగుపరచడం. నేరాల పరిశోధనను సత్వరంగా పూర్తి చేయడం. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సేవలను వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. 

పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా మార్చడం, పోలీసు అధికారులకు ప్రోత్సా హం అందిస్తూ, కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా పని చేయాలని సూచించారు.  అనంతరం మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు,  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సహకరిం చిన వారికి ప్రశంస పత్రాలను డీజీపీ అందించారు.

ఈ కార్యక్రమంలో మల్టీ జోన్-2 ఐజి శ సత్యనారాయణ, జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్.ఏస్.చౌహన్,  నారాయణ పేట ఎస్పీ యోగేష్ గౌతమ్, మహబూబ్ నగర్ ఎస్పీ డి జానకి, అదనపు ఎస్పీ రాములు, ఎఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు,రమణా రెడ్డి, సుదర్శన్, గిరిబాబు, సుదర్శన్ రెడ్డి,  ఇన్స్పెక్టర్స్, ఆర్‌ఐఎస్. నారాయణపేట జిల్లా నుండి అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హ క్, డిఎస్పీ ఎన్ లింగయ్య, సిఐ లు శివ శంక ర్, చంద్ర శేఖర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, దస్రు నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.