calender_icon.png 7 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఈ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల

07-02-2025 01:23:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలంగాణలో పీఈ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి గురువారం విడుదల చేసిం ది. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం  కల్పించామని ఉన్నత విద్యా మండలి వెల్లడిం చింది. జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు జరుగుతాయి.

మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్

తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను కాకతీయ వర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 1వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎడ్‌సెట్ పరీక్షలు జరగనున్నాయి.