calender_icon.png 9 October, 2024 | 2:46 AM

రియల్టీలో పీఈ పెట్టుబడులు రెండింతలు

09-10-2024 12:54:46 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్యకాలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు రెండింతలు పెరిగాయి. దేశంలో ప్రాపర్టీకి డిమాండ్ జోరు ద్వారా లాభాలు పొందేందుకు ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని పెంచుతున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సావిల్స్ ఇండియా తెలిపింది.

ఈ ద్వితీయ త్రైమాసికంలో రియల్టీ రంగంలోకి 2.3 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడు లు వచ్చాయని, గత ఏడాది ఇదేకాలంలో వచ్చిన 934 మిలియన్ డాలర్లతో పోలిస్తే రెండు రెట్లకుపైగా పెరిగాయని వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ ఈ రంగం 3.9 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడుల్ని ఆకర్షించినట్లు తెలిపింది.

2023 సంవత్సరం మొత్తం పెట్టుబ డులకంటే 2024 తొలి తొమ్మిది నెలల్లో అధికంగా వచ్చాయని వెల్లడించింది. జూలైటీ మధ్యకాలంలో వచ్చిన రియల్టీ పీఈ పెట్టుబడుల్లో అధికభాగం  ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ లోకి 1.7 బిలియన్ డాలర్లు (77 శాతం) వచ్చాయని, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విభాగం 21 శాతం పెట్టుబడుల్ని ఆకర్షించిందని తెలిపింది.