calender_icon.png 25 February, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ భృతి అమలు ఎపుడు..?

25-02-2025 07:22:20 PM

పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అధికారం చేపట్టగానే దాని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. ఎస్ ప్రదీప్, వి. అజయ్ అన్నారు. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మార్క్స్ భవన్ లో పి వై ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలో పదేళ్లు ఉన్నా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు సరికదా కనీసం నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని అన్నారు. దీంతో నిరుద్యోగ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఇపుడు అదే బాటలో కాంగ్రెస్ నడుస్తుందన్నారు.

అధికారంలోకి వచ్చి, ఏడాది పూర్తయినా, దీనిపై విధి విధానాలు కూడా ప్రకటించడం శోచనీయమన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో నిరుద్యోగులపై ప్రత్యేకంగా చర్చించి, బడ్జెట్ కేటాయింపులు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం మందులు కూడా పంపిణీ చేయలేని దుస్థితి ఉందన్నారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ నియంత్రణ లేదని అన్నారు. ఈ సమస్యపై పి.వై.ఎల్, పిఓడబ్ల్యు మూడు నెలలుగా పోరాడిందన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పి.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఎం. రవి కుమార్, ఎన్. వి రాకేష్, సభ్యులు జె. భరత్, బి. ఎస్ కృష్ణ, దేవ, కుర్సా రామకృష్ణ, నవీన్, అనీస్, వినోద్ పాల్గొన్నారు.