calender_icon.png 21 March, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి సరిపడని కేటాయించాలి

21-03-2025 06:30:08 PM

వీడియోస్ జిల్లా కార్యదర్శి ప్రణయ్ కుమార్

కొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యారంగానికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 15% నిధులు కేటాయించాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్ కుమార్(PDSU District General Secretary Pranay Kumar) డిమాండ్ చేశారు. పీడీఎస్యు రాష్ట్ర కమిటీ(PDSU State Committee) పిలుపులో భాగంగా విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటానించాలని అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్యు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో లో ఇచ్చిన హామి ప్రకారం విద్యారంగానికి 15% బడ్జెట్ ను కూడా కేటాయించ లేదని, రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వ విద్యారంగం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని, రాష్ట్ర బడ్జెట్ ను తిరిగి సవరించి విద్యారంగానికి కనీసం 20% బడ్జెట్ ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజ్ రియంబర్మెంట్స్ ను వెంటనే విడుదల చెయ్యాలన్నారు. 

విద్య శాఖకు వెంటనే మంత్రిని నియమించాలని, ఉస్మానియా యూనివర్సిటీ హక్కులను కాలరాస్తూ వైస్ ఛాన్సలర్ తీసుకువచ్చిన సర్క్యులర్ ను వెనక్కు తీసుకోవాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం,యుజిసి నూతన నిబంధనలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన నాయకుల ను అక్రమంగా అరెస్టు చేసి న, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన అప్రకటిత నిర్బంధాన్ని కొనసాగిస్తుందని మండి పడ్డారు. అక్రమ అరెస్టులతో, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వమే కూని చేసిందని ఆరోపించారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చెయ్యాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని యెడల దశల వారిగా అందోళలకు పిలుపునిస్తమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.