calender_icon.png 23 September, 2024 | 12:01 AM

పిడిఎస్ యూ 50 వసంతాల లోగో ఆవిష్కరణ

22-09-2024 09:48:13 PM

విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలి

మాజీ పిడిఎస్ యూ నాయకులు డాక్టర్ కొప్పుల రంగారెడ్డి

సూర్యాపేట,(విజయక్రాంతి): పిడిఎస్ యూ అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పి.డి.ఎస్.యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పిడిఎస్ యూ పూర్వ, ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ వూర్వ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ రంగారెడ్డి మాట్లాడుతూ... 1974 సంవత్సరంలో పిడిఎస్ యూ ఏర్పడిందని, గత 50 సంవత్సరాల కాలంలో విద్య రంగ సమస్యలపై, శాస్త్రీయ విద్యా సాధనకై, సమ సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పిడిఎస్ యూ విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందన్నారు.

50 ఏళ్ల జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కొలా శంకర్, చేరాలు, మారోజు వీరన్న, రంగవల్లి, యానల విరరెడ్డి లాంటి ఎందరో విద్యార్ధి రత్నాలు తమ ప్రాణాలను బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించరని అన్నారు. పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని,సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్టోబర్ 1న, హైదరబాద్ లో ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ 24న జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాభోత్సవ సభను పూర్వ, ప్రస్తుత పిడిఎస్ యూ కార్యకర్తలు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పిడిఎస్ యూ నాయకులు లింగంపల్లి భద్రయ్య, మండారి డేవిడ్ కుమార్, బద్దం అశోక్ రెడ్డి, ముప్పాని కృష్ణారెడ్డి, రవికుమార్,పుప్పాల వీరన్న, వీరబోయిన లింగయ్య, గంట కార్తీక్,  ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.