calender_icon.png 27 February, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

27-02-2025 07:04:02 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి(PDSU District General Secretary Tirupati) డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లెనిన్, నాయకులు సుశాంత్, రవికాంత్, సుమిత్, అమిత్, దీక్షిత్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.