12-04-2025 12:00:00 AM
కోదాడ ఏప్రిల్ 11: తమ్మరబండపాలెంకు చెందిన షేక్ సికిందర్ అనే ఆటో డ్రైవర్ పీడీఎస్ బియ్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. కోదాడ రూరల్ ఎస్త్స్ర అనిల్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం సికిందర్ భీక్యతండా గ్రామంలో రేషన్ కార్డుల దారుల వద్ద తక్కువ రేటుకు సుమారు 4 క్వింటలు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి, తన ఆటోలో ఆంధ్రాకు చెందిన రామిరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన భరత్ కుమార్ కు అమ్ముటకు తరలిస్తుండగా కూచిపూడి గ్రామ శివారులో గల గణపవరం వెళ్ళే రోడ్డు వద్ద పోలీసు, సివిల్ సప్లయి అధికారులు ఉమ్మడి తనిఖీలు చేసి పట్టుబడి చేయటం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.