18-03-2025 01:23:01 AM
కోదాడ మార్చి 17: అక్రమంగా రవాణా చేస్తున్న 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను పట్టుకున్నట్లు కోదాడ రూరల్ ఎస్త్స్ర అనిల్ రెడ్డి సోమవారం తెలిపారు. తమ్మరబండపాలెంకు చెందిన సుల్తాని రాము అక్రమంగా ఆటోలో పీడీఎస్ బియ్యంతరలిస్తుండగా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. మైల రామిరెడ్డి డిప్యూటీ తహసిల్దార్ పిర్యాదు మేరకు సుల్తాని రాము పై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్త్స్ర అనిల్ రెడ్డి తెలిపారు.