calender_icon.png 14 March, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3.5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

13-03-2025 09:38:08 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నెపల్లి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా 3.5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచాడనే సమాచారం మేరకు గురువారం తనిఖీలు నిర్వహించగా  3.5  క్వింటాళ్ల రైస్ లభించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. దీనిపై విచారించగా సూర్జాపూర్ గ్రామానికి చెందిన ఇందూరు లక్ష్మణ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు.