calender_icon.png 19 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత

18-03-2025 06:40:49 PM

300 కింటలు బియ్యం లారీ సీజ్... ఎస్ఐ సుభాష్ గౌడ్

మనోహరాబాద్ (విజయక్రాంతి): ఓ లారీలో అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తుండగా 300 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం, లారీని సీజ్ చేసిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ చివరలో ఉన్న ఓ దాబా వద్ద చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి నాగపూర్ వైపు పిడిఎస్ బియ్యం గల లారీ 44వ జాతీయ రహదారి కూచారం గ్రామ చివరిలో ఉన్న పంజాబీ దాబా వద్ద స్థానిక ఎస్సై సుభాష్ గౌడ్ తమ సిబ్బంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి రహదారి వెంట అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని సీజ్ చేసి విచారించగా ఆర్ఐ దీక్షిత్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్, ఓనర్, పిడిఎస్ బియ్యం తరలిస్తున్న ఓనర్ ల ముగ్గురిపై కేసు నమోదు చేసి సీజ్ చేసిన 300 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని సేఫ్ కస్టర్డ్ నిమిత్తం కోసం తూప్రాన్ లోని ఎంఎల్ ఎస్ గోదాముకు తరలించామని ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.