calender_icon.png 18 March, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నకోరుకోండిలో పిడిఎస్ రైస్ మాయం

17-03-2025 06:58:27 PM

కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలో చిన్నకోరుకోండి గ్రామంలో చౌక దుకాణంలో పిడిఎస్ రైస్ బస్తాలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ. 16.03.2025న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో పౌరసరఫలాల గిడ్డంగి నుండి లారీలో 117 క్వింటాల్ రేషన్ బియ్యం మొత్తం 234 బస్తాలు చిన్న కోరుకొండ గ్రామంలో గల చౌక ధరల దుకాణం రేషన్ డీలర్ షాపు నందు రెండు గదులలో పిడిఎస్ రైస్ బియ్యం దింపి గదికి తాళాలు వేసి వెళ్ళినారని మరుసటి రోజు అనగా 17/3 /2025న ఉదయం సుమారు 8 గంటల సమయంలో రేషన్ షాప్ వద్దకు వెళ్లి చూడగా గది తాళం పగలగొట్టబడి ఉంది. లోపలికి వెళ్లి చూడగా 180 బియ్యం బస్తాలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్ళినారని గదిలో 15 బస్తాలు బియ్యం మాత్రమే ఉన్నాయని దొంగిలించుకు వెళ్లిన రేషన్ బియ్యం విలువ 2,40,000/- ఉండునని గుడిద బిక్షాలు తండ్రి లేటు పెద్ద లక్ష్మయ్య వృత్తి రేషన్ డీలర్ ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.