11-03-2025 09:23:14 PM
ఎస్సై ఆంజనేయులు...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో అక్రమంగా ఓ వ్యక్తి పిడిఎస్ రైస్ తరలిస్తుండగా మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూక్య శ్రీనివాస్ అనే వ్యక్తి తిప్పాపూర్ గ్రామంలో తక్కువ ధరకు పిడిఎస్ రైస్ దొరుకుతుందని 4.83 క్వింటాళ్ల బియ్యాన్ని కొని తరలిస్తుండగా డిటి ఎర్రం కృష్ణయ్యతో కలిసి పోలీసులు అతనిని పట్టుకొని, వెహికల్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.