హనుమకొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి కి చెందిన గజ్జి సహదేవ్ రాజ్ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్ మీ దుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్నాడు. గతనెల మరో ఇద్దరు నిందితులతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్, దామెర పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.50 లక్షల విలువగల గంజాయితో పాటు ఒక కారు, మూడు సెల్ఫోన్లు సీ జ్ చేశారు. అనంతరం నిందితులను జై లుకు తరలించారు. ఈ నేపథ్యంలో తర చూ నేరాలకు పాల్పడుతున్నందున స హదేవ్ రాజ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు న మోదు చేసిన శాయంపేట ఇన్స్పెక్టర్ రంజిత్ రావు, దామెర్ ఎస్ఐ అశోక్.. ప రకాల సబ్జైల్లో ఉన్న నిందితుడికి సో మవారం ఉత్తర్వుల కాపీని జైలర్ సమక్షంలో అందజేశారు.