calender_icon.png 12 March, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి డాన్ అంగూరుబాయిపై పీడీ యాక్ట్

12-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): ఎక్సైజ్ పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అంగూరుబాయిపై పీడీయాక్ట్ నమోదైంది. నగరానికి వలస వచ్చి ధూల్  స్థిరపడి గంజాయి డాన్‌గా ఎదిగిన ఆమెపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీడీయాక్ట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆమెకు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ మధుబాబు పీడీ యాక్ట్ ఉత్తర్వుల కాపీని మంగళవారం అందజేశారు.  కాగా అంగూరు  పై 30 కేసులకు పైగా కేసులున్నాయి.