calender_icon.png 12 October, 2024 | 2:51 PM

ప్చ్.. మూడో రోజు కూడా

30-09-2024 12:00:00 AM

వరుణుడు కరుణించినా.. కానీ సిద్ధం కాని మైదానం

కాన్పూర్: భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వరణుడు కరుణించినా కానీ మైదానం సిద్ధం కాకపోవడం మైనస్‌గా మారింది. దీంతో అంపైర్లు చాలా సార్లు చెక్ చేసి ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

తీరు మార్చుకోని యూపీసీఏ

మొన్నటికి మొన్న న్యూజిలాండ్-అఫ్ఘన్ మధ్య మ్యాచ్ ఇలాగే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం తగ్గినా కానీ మైదానాన్ని సిద్ధం చేయడంలో నోయిడా గ్రౌండ్స్‌మెన్ పూర్తిగా విఫలం అయ్యారు. అధునాతన పరికరాలు లేకపోవడమో మరే కారణమో కానీ మ్యాచ్ మాత్రం రద్దయింది. 

‘కంగారూ’ పడ్డా కానీ..

బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 5 వన్డేల సిరీస్‌ను 3-2 తేడా తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లం డ్ 49.2 ఓవర్లలో 309 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 20.4 ఓవర్లలో 165/2 వద్ద ఉ న్నపుడు వర్షం మొదలైంది. వాన ఎంతకీ త గ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌లూయిస్ ప ద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. మొదటి రెండు వన్డేలతో పాటు ఐదో వన్డేను కూడా గెలిచిన కంగారూలు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. 

లావోస్‌పై విజయం

లావోస్: ఏఎఫ్‌సీ అండర్-20 ఆసి యా కప్ క్వాలిఫయర్స్‌లో భారత్ 2-0 తేడాతో ఆతిథ్య లావోస్‌ను మట్టికరిపించింది. 4 జట్లున్న గ్రూప్‌లో భారత్ రెండో స్థానం పొందింది. భారత్ రెండు విజయా లు సాధించగా, ఇరాన్ మూడు విజయాలతో టాప్ ర్యాంకు సాధించింది.  2025 లో చైనాలో జరిగే ఏఎఫ్‌సీ అండర్-20 ఈవెంట్‌కు ప్రతి గ్రూప్‌లో టాప్‌లో ఉన్న పది జట్లతో పాటుగా ప్రతి గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన 5 జట్లు అర్హత సాధించనున్నాయి.