calender_icon.png 19 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఎస్సీ పేరు తెలియనోళ్లు ఆరోపణలు చేయడమా?

17-04-2025 12:01:56 AM

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై చనగాని దయాకర్ ధ్వజం..

హైదరాబాద్ (విజయక్రాంతి): గ్రూప్ పరీక్ష నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పేరు కూడా తెలియనోళ్లు ఆరోపణలు చేయడమేంటని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని అసమర్థులే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల పొట్లాలకు కట్టి అమ్మారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించిందన్నారు. నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని బీఆర్‌ఎస్ చూస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చినా బీఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి మారలేదన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగుల రేటింగ్ శాతం తగ్గిందన్నారు.