17-04-2025 05:05:40 PM
హైదరాబాద్: 400 ఎకరాలకు ప్రైవేటుపరం చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో తెలిపారు. ఏఐ ఫేక్ వీడియోలు చూసి ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) కూడా పొరపాటు పడ్డారని అన్నారు. ఫేక్ వీడియోలు అని తెలిశాక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఎక్స్ లో పెట్టిన వీడియోలు తొలగించారని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా కేటీఆర్(KTR) తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని, కేటీఆర్ తన అనుయాయులకు వేల ఎకరాలను అప్పనంగా కట్టబెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే భూములను రూ.30 లక్షలకే అమ్మారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రౌడినని స్వయంగా చెప్పుకుంటున్నరాని, రౌడి వ్యక్తిత్వం కాబట్టే దిల్లీ వరకు వెళ్లి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తిపరం అవుతున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకున్నదని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.