calender_icon.png 3 April, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌కు సన్మానం

21-03-2025 12:50:42 AM

ముషీరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): బీసీలకు 42శాతంతో చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించేందుకు కృషిచేసిన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను గురువారం తెలంగాణ గౌడ కల్లుగీ సంఘా ల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్కుమార్ గౌడ్  పూలబొకే, శాలువాతో సన్మా నించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... కేంద్రానికి బీసీ బిల్లు చట్టబద్దత కోసం పంపించి ఊరుకోబోమని పార్లమెంటులో తమ సభ్యులతో మాట్లాడించి చట్టబద్దత కోసం కృషిచేస్తామని మహేష్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా జనగణన, కులగణన చేసేంత వరకు అనే  రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెడుతున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. 42శాతం స్థానిక సంస్థలతో పాటు విద్యా విద్యోగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.