ఘనంగా పీసీసీ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు
25-05-2026 01:28 AM
హనుమకొండ అర్బన్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, నల్గొండ రమేష్, గుండేటి నరేందర్, కరాటే ప్రభాకర్, బసవరాజ్ శ్రీమాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేష్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, దూపత్ సంపత్, జన్ను రవి, గోరంటల రాజు తదితరులు పాల్గొన్నారు.






