calender_icon.png 7 January, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8న పీసీసీ పీఏసీ సమావేశం

06-01-2025 01:40:13 AM

* హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ 

* రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికల అంశాలపై చర్చ

 హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) ఈ నెల 8న  భేటీ కానున్నది. సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు 23 మంది పీఏసీ సభ్యు లు పాల్గొంటారు.

సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థ లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానంగా చర్చించనునట్లు తెలిసింది. అలాగే కుల గణన, ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపైనా చర్చ సాగుతుందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీఏసీ సమావేశం నిర్వహణ ఇదే మొదటిసారి కావడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రైతుభరోసా నిర్ణయం హర్షణీయం: పీసీసీ చీఫ్

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల కోసం రైతుభరోసా పథకం అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం హర్షణీయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం ప్రకటించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.12 వేల వరకు భరోసా ఇస్తామన్నందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.