calender_icon.png 24 October, 2024 | 3:49 PM

నిస్సహాయులకు వరం పీసీసీ

29-07-2024 01:23:28 AM

  1. పాలియేటివ్ కేర్ సెంటర్‌కు ఆరేళ్లు పూర్తి
  2. ఫోన్ కొడితే ఇంటి వద్దే వైద్యం 
  3. నయంకాని జబ్బు చేస్తే అంబులెన్స్‌లో ఆస్పత్రికి..

హనుమకొండ, జూలై  2౮ (విజయ క్రాంతి): అక్కడ ప్రజలకు జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కొట్టి సమాచారం ఇస్తే చాలు అంబు లెన్స్ ద్వారా డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. దీన్ని అమలు చేసేందుకు బీఆర్‌ఎస్ హయాంలో ఆరేళ్ల  కిందట(2018) ఎంజీ ఎం ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ సెంట ర్(పీసీసీ)ను ప్రారంభించారు. మంచానికి పరిమితమై లేవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రోగుల ఇంటికెళ్లి వైద్యం అందిం చేందుకు గానూ ఈ సెంటర్‌ను ప్రారంభిం చారు.

నిరంతరం వైద్యసేవలు అందించేం దుకు డాక్టర్, ఫిజియో థెరపిస్ట్, స్టాఫ్‌నర్స్, సిబ్బందిని నియమించారు. పల్లెల్లో ఇంటికి వెళ్లి వైద్యసేవలు అందించటం, అక్కడ రోగం నయం కాలేని పరిస్థితి ఉంటే ఆ పేషెంట్‌ను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడం ఈ సెంటర్లో పనిచేసే వారి కర్తవ్యం. ఆస్పత్రిలో వైద్య సేవలకు గానూ పది పడకలు అందుబాటులో ఉంచా రు. ఆరేళ్లలో మూడువేల మంది రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పాలియేటివ్ కేర్ సెంటర్ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ సెంటర్‌లో క్యాన్సర్, పక్షవాతం, కీమో థెరపీ, రేడియేషన్, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, శ్వాసకోస వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సమాచారం ఇస్తే చాలు అంబులెన్స్‌తో సహా ఇంటికి వెళ్లి చికిత్స చేస్తున్నారు. 

ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తున్నాం

అనారోగ్యానికి గురైన వారు నడవలేని పరిస్థితి ఉంటే అంబు లెన్స్‌లో వెళ్లి వెళ్లి వైద్యం చేస్తున్నాం. రోగి కండీషన్ సీరియస్‌గా ఉంటే అం బులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. పేషెంట్‌కు సహాయ కులు లేకున్నప్పటికీ ఆస్పత్రిలో ఉన్న అ టెండర్ల సాయంతో సేవలు అందజేస్తున్నాం. 

   డాక్టర్ సురేందర్, ఫిజియోథెరపిస్ట్