- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్ఠానం
- త్వరలోనే పదవుల పందేరం
- వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురికి అవకాశం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) పరిధిలో పదవుల పందేరానికి వేళయింది. పా ర్టీ నేతలు ఎప్పుడెప్పుడా..? అని ఎదురు చూ స్తున్న తరుణం రానే వచ్చింది. పీసీసీ కార్యవర్గ కూర్పునకు తాజాగా ఢిల్లీ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. కానీ.. మంత్రివర్గ విస్తరణ, నామి నేటెడ్ పదవుల భర్తీ మాత్రం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
ముఖ్యంగా నా మినేటెడ్ పదవులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. మంత్రివర్గ కూర్పులోనూ సమీకరణలు కుదరడం లేదని, ఈ కారణంతోనే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో 11 మంది మంత్రులు ఉన్నారు.
వీరు కాక మరో ఆరు బెర్తులు ఖాళీ ఉండగా, వా టిని భర్తీ చేయాల్సి ఉంది. ఖాళీ గా ఉన్న మం త్రి పదవులకు దాదాపు డజన్ మందివరకు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కానీ.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ లో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లే.. అని ప్రకటించడంతో ఆశవాహులకు నిరాశకు గురయ్యారు.
ఎంతోమంది ఆశావహులు..
కాంగ్రెస్ పార్టీలో పదవులకు ఎలాంటి అడ్డంకి లేకపోవడంతో వీలైనంత త్వరగా పదవులు భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు పూర్తవుతున్నది. అప్పటి నుంచి కూడా పీసీసీ టీంలో పాత కార్యవర్గమే కొనసాగుతున్నది. పీసీసీ చీఫ్ ప్రస్తుతం తనకు అనుకూలమైన బృందాన్ని నియమించుకోవాలని భావిస్తున్నారు.
మరోవైపు జిల్లాల వారీగా, సామా జికవర్గాల వారీగా సమీకరణాలు కుదరకపోవడంతో పదవుల భర్తీ కొంత ఆలస్యమవుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానమే తాజాగా ఢిల్లీలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై పీసీసీ కూర్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ డంతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం వచ్చిం ది. పీసీసీ అధ్యక్షుడితో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది.
ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటు ఓసీ లేదా రెడ్డి సామాజిక వర్గాలకు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకోడ్ నేపథ్యంలో నామినేటెడ్ పదవులకు బ్రేక్ పడింది.