- నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాలి
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన
- కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యనేతలకు దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): పీసీసీ కార్యవర్గంతో పాటు ఇప్పటి వరకు భర్తీ చేయకుం డా మిగిలిపోయిన నామినేటెడ్ పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యద ర్శి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ సూచించారు. పార్టీ కోసం పని చేసే వారికే పదవుల్లో స్థానం కల్పించాలని, డీసీసీ అధ్యక్షులు, ఇతర పదవు ల నియామకంలో న్యాయం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ కేసీ వేణుగోపాల్ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన కీలక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాటు మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలతో పాటు ఏడాదిలో ప్రభుత్వ పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చ జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు.. రాష్ట్రంలోని రెండు ప్రధాన అంశాలను పరిష్కరించి ముందుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసిన విషయాన్ని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఇక రాష్ట్రంలో మరో ప్రధానమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణను కూడా అమలు చేయాలని అభిప్రాయానికి వచ్చారు. ఆరు గ్యారెంటీల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంకా అమలు చేయాల్సిన పథకాలపై చర్చించారు. ఇప్పటివరకు అమలు చేయని వాటిని త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు.
మంత్రుల పనితీరుపై చర్చ..
ఈ సమావేశంలో మంత్రులకు సంబంధించిన శాఖలపై సైతం చర్చించినట్లు తెలిసింది. కొందరు మంత్రుల పనితీరు బాగా లేదని, వారు తమ విధానాలను మార్చుకోవాలని ఇటీవలే గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కేసీ వేణుగోపాల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేసీ వేణుగోపాల్ మరోసారి ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణలో రాహుల్‌గాంధీ హాజరయ్యే సంవిధాన్ సభను విజయవంతం చేయాలని సూచించారు. రాహుల్‌గాంధీ సమయాన్ని బట్టి ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.
మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం, సీఎం నిర్ణయం
ఈ నెలాఖరులో నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గం భర్తీ చేయాలని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. మంత్రి వర్గ విస్తరణ, మార్పులు, చేర్పులపై పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపా రు. రాజ్యాంగ పరిరక్షణ (సంవిధాన్ బచావో) ర్యాలీని సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్