- ‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- బీఆర్‌ఎస్ హయాంలో అప్పులకుప్పగా రాష్ట్రం
- విధ్వంసం నుంచి ఇప్పుడు వికాసం వైపు తెలంగాణ
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కనుమరుగు
- నాకు పీసీసీ పదవే చాలు.. మంత్రి పదవి వద్దు
- తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం అనవసరం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాదు.. కిస్మత్‌రెడ్డి
ఈ నెల చివరివారం లేదా జనవరి మొదటి వారంలో పీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన క్యాడర్‌కు న్యాయం చేస్తాం. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను విధ్వంసం చేసింది.
గత ఏడాది పాలనాపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నది. ఏఐసీసీ పరిధిలోనే మంత్రివర్గ విస్తరణ అంశం ఉన్నది. అధిష్ఠానంతో చర్చించి సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ విస్తరణ చేస్తారు. నేను మంత్రి పదవి అడుగను.. పీసీసీ పదవే పెద్ద అచీవ్‌మెంట్.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో బీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధికి ఒక్క రూపాయి తేవట్లేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపు గాలివాటం.. ఆయన కిస్మత్‌రెడ్డి.
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి ): డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో పీసీసీ కార్యవర్గంతోపాటు నామినేటెడ్ పదవులను భర్తీచేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వికాసం వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. నిజాం హ యాంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను సాధించిపెడితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ భూములు, ఇతర ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
పేదలకు నాణ్యమై న విద్య, వైద్యాన్ని అందకుండా గత పాలకులు కుట్ర లు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తక్కువ సమయంలోనే ప్రజలకు ఎక్కువ సంక్షేమాన్ని అందించారని స్పష్టంచేశా రు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన మేర కు రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే 90 శాతానికి పైగా పూర్తి అయ్యిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావడంతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భం గా ఆయన ‘విజయక్రాంతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో నిరుద్యోగం 5 శాతం తగ్గింది
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ప్రైవేట్‌లోనూ అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. కాంగ్రెస్ సర్కా ర్ వచ్చాక ఉపాధి, అవకాశాలు పెరగడం, వివిధ శాఖ ల్లో 56 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి, అవకాశాలు లభించడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది.
బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగం 22.9 శాతం ఉండగా, ప్రస్తుతం 18.1 శాతానికి తగ్గిం ది. విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద వాడికి నాణ్యమైన విద్య ను అందించాలని ప్రతి నియోజక వర్గం లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ప్రతి ఒక్కరికి సకాలంలోనే వైద్యం అందాలని ఆసుపత్రుల్లో డా క్టర్లు, సిబ్బంది నియామకం చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, భూదోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ విచారణ పూర్తికాగానే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి. కేటీఆర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య ఏమి జరిగిం దో తెలియదు. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
బీఆర్‌ఎస్‌లో ౩ ముక్కలు.. బీజేపీలో ౪ ముక్కలాట
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలుచేస్తుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత.. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ నుంచి బయటికి రానీవ్వడం లేదు.
ప్రజలకు మేలు చేస్తుంటే ఎందుకు ఓర్చుకోవడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ను ప్రజలు కనిపించకుండా చేస్తారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురావడం లేదు. ఆ పార్టీలో నాలుగు ముక్కలాట నడుస్తోంది.
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉత్తర, దక్షిణ దృవాలుగా, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పంచుకున్నారు. వీరిలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కిస్మత్‌రెడ్డి అనొచ్చు. ఎప్పుడు గెలిచినా ఏదో ఒక గాలిలో విజయం సాధిస్తున్నారు.
సంక్రాంతి నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇందుకోసం సంక్రాంతి నుంచి ఉగాది మధ్యలో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు చే యాలి. ఆ తర్వాత తమిళనాడు తరహాలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకమై కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలి.
గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావు
కాంగ్రెస్ అధికారంలో రావడానికి కార్యకర్తల కష్ట మే కారణం. వారికి పార్టీ, ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే 37 కార్పొరేషన్లను నామినేటెడ్ పదవుల్లో పార్టీ అనుంబంధ సంఘాల వారికి అవకాశం కల్పించాం. ఇంకా చాలా నామినెట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ చుట్టు తిరగొద్దు.
ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. మెజార్టీ సీట్లను సాధించుకోవాలి. అందుకు ‘సెలక్ట్ టూ ఎలక్ట్ ’ అనే విధానంతో గెలిచే వారికే పార్టీ అవకాశం కల్పిస్తుంది. కులగణన సర్వే పూర్తి కావచ్చింది. జనాభా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. బీఆర్‌ఎస్ లీడర్లు కూడా కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి.
త్వరలో పీసీసీ పూర్తి కార్యవర్గం
పీసీసీ పూర్తి కార్యవర్గం, మిగిలిన నామినెటెడ్ పదవుల పంపకం ఈ నెల చివరలో లేదంటే జనవరి మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. సీఎంతోపాటు మంత్రులు, పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు అందరితో సంప్రదించి ప్రకటిస్తాం. నామినే టెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తాం.
మంత్రి పదవి అడుగను
నాకు పీసీసీ అధ్యక్ష పదవి చాలు. మంత్రి పదవి అడుగను. అధ్యక్ష పదవే నాకు పెద్ద అచ్చీవ్‌మెంట్.
బీఆర్‌ఎస్‌లో ఇమడలేకనే ఎమ్మెల్యేలు మావైపు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకనే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇంకా చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమానికి ఆకర్షితులవుతున్నారు. ఎన్నికల్లో చెప్పిన అనేక హామీలు అమలుచేసినం.
ఇంకా చేయాల్సిన ఉన్నవి. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేయడంతో వాటికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల వరకు అసలు, మిత్తి చెల్లిస్తున్నాం. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకుంటోంది. మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. మిగతా హామీలను కూడా అమలు చేస్తాం.
ఏఐసీసీ పరిధిలో మంత్రివర్గ విస్తరణ
మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలోని అంశం. పార్టీ అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పదవులు ఎవరికి ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. రేవంత్‌రెడ్డి మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరి శాఖలో వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎస్సీ వర్గీకరణపై పార్టీ నిర్ణయమే ఫైనల్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్. పార్టీలోని మాదిగ, మాల సామాజికవర్గం ఎమ్మెల్యేలు పెట్టుకున్న సమావేశాలు, సభలు మా దృష్టికి వచ్చాయి. అయితే వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. వారి కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. నివేదిక వచ్చాక సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది.
తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం అర్థరహితం
తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ నేతలు రాద్దాంతం చేయడంలో అర్థం లేదు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా విగ్రహం రూపుదిద్దుకుంది. ప్రజలను ఆశీర్వదించినట్టు చెయ్యి ఉంటే పార్టీకి అంటగడ్డం చూ స్తుంటే వాళ్ల పరిణితి ఎలా ఉందో తెలుస్తోంది.