calender_icon.png 28 April, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వల్లే.. కేసీఆర్ సీఎం అయ్యారు

28-04-2025 02:34:40 PM

తక్కువు సమయంలో ఎక్కువ దోచుకుంది కేసీఆర్ కుటుంబం

తెలంగాణకు కేసీఆర్ విలన్ గా మిగిలిపోతారు.

కేసీఆర్.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

హైదరాబాద్: కేసీఆర్.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులు, భూముల పేరిట దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశారని ఆయన మండిపడ్డారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చారని విమర్శించారు. పలాయనం చిత్తగించిన వ్యక్తి కాంగ్రెస్ గురంచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ విలన్ గా మిలిగిపోతారని ఆయన చమత్కరించారు.

కాంగ్రెస్ ను విలన్ అంటున్నారు.. యువతరం కేసీఆర్ ను క్షమించదన్నారు. సర్వం త్యాగం చేసి గాంధీ కుటుంబం(Gandhi Family) గురించి ఆరోపిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దొంగ పాస్ పోర్టులు సృష్టించి విదేశాలకు పంపిన చరిత్ర కేసీఆర్ దిని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యాయని వెల్లడించారు. తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్ గా నిలుస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణను అన్ని రకాలుగా నాశనం చేశారని విమర్శించిన మహేశ్ కుమార్ గౌడ్ టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మార్చి.. పార్టీ పేరులో తెలంగాణ పదమే తొలగించారని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఘరానా మోసమని ప్రజలకు తెలుసన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద 4.5 లక్షల మందికి ఇస్తున్నామని మహేశ్ కుమార్ వెల్లడించారు.