calender_icon.png 7 January, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలకు పీసీసీ చీఫ్

05-01-2025 02:11:12 AM

  1. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు 
  2. నేడు నాగార్జున సాగర్‌లో ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం 
  3. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి నిజామాబాద్ జిల్లా పర్యటనలు
  4. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాపాలన తొలి ఏడాది విజయాలపై చర్చ 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కు మార్‌గౌడ్ ఆదివారం నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్య దర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌లో నిర్వహించే ఆదివాసీ కాంగ్రెస్ సమావేశానికి వీరు హాజరుకానున్నారు.

6న ఆదిలాబాద్, 7న నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.  ఈ సమావేశాలకు ఆయా జిల్లాలకు చెందిన మం త్రులు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీ లు,  డీసీసీ అధ్యక్షులు,  గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాపాలన మొదటి వార్షికోత్సవ విజయాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.