calender_icon.png 30 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించని పరిశ్రమలపై పీసీబీ కొరడా

30-11-2024 04:13:13 PM

రెండు పరిశ్రమలకు రూ.16 లక్షల జరిమానా, రూ.48 లక్షల బ్యాంకు గ్యారంటీలు విధింపు 

పటాన్ చెరు (విజయక్రాంతి): నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న లీ ఫార్మా పరిశ్రమ, గ్రాన్యూవల్స్ పరిశ్రమలకు  పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి జరిమానా విధించినట్లు పీసీబీ ఈ ఈ కుమార్ పాఠక్ శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలను అదనుగా చేసుకొని లీ ఫార్మా పరిశ్రమ కాలుష్య జలాలను పైపుల ద్వారా బయటకు పంపిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అధికారులకు అందజేశారు. విచారణ జరిపిన పీసీబీ అధికారులు లీ ఫార్మా పరిశ్రమకు రూ. 8 లక్షల జరిమాన రూ .24 లక్షల బ్యాంక్ గ్యారెంటీని విధించారు. అలాగే నిబంధనలు పాటించని బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యూవల్స్ పరిశ్రమకు రూ.8 లక్షల జరిమానా, రూ. 24 లక్షల బ్యాంక్ గ్యారెంటీని పీసీబీ ఎమ్మెస్ విధించినట్లు పీసీబీ ఈఈ తెలిపారు. నిబంధనలు పట్టించుకోకుండా ఇక ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తే మూసివేత ఉత్తర్వులు ఇస్తామని రెండు పరిశ్రమలను ఎంఎస్  హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.