కరాచీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూర్కత్వం ప్రదర్శిస్తోంది. ట్రోఫీ నిర్వహణకు సంబంధించి ఐసీసీ, బీసీసీఐతో జరగాల్సిన వర్చువల్ మీటిం గ్‌కు తాము హాజరవడం లేదంటూ శనివారం పేర్కొంది. నవంబర్ 26న వర్చువల్ మీటింగ్ జరగాల్సి ఉంది.
భద్రతా కారణాల రిత్యా టీమిండియాను పాక్ పంపించేందుకు బీసీసీ ఐ నిరాకరించడంతో ఐసీసీ వేదిక మార్పుపై ఆలోచన చేయాలని పీసీబీని కోరింది. కానీ పీసీబీ మాత్రం టోర్నీ నిర్వహిస్తామంటూ తమ మొం డి వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. ‘ఐసీసీ, బీసీసీఐతో మాకు వర్చువల్ మీటింగ్ ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదు’ అని పీసీబీ తెలిపింది.