22-02-2025 12:34:39 AM
పట్టించుకోని పీసీబీ అధికారులు
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): నగరం లో రోజు రోజుకు కంపెనీల నుండి వెలువడే విష వాయువులు ఎక్కువైపోతున్నాయి.వీటి వలన వాయు కాలుష్యం మితిమీరి పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన కూడా మామూళ్లకు అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో దుండిగల్ రాంకీ వెస్ట్ నుంచి విడుదలవు తున్న వాయు కాలుష్యం వలన దుండిగల్ తండా ప్రజలు ఊపిరి పీల్చుకోలేక పోతు న్నారు. రాంకీ నుంచి వెలువడుతున్న పొగ, మరోవైపు రాంకీ కంపెనీ భూగర్భంలోకి డంపింగ్ చేస్తున్న వ్యర్థాల వలన తండా ప్రజ లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రీన్ ట్రిబ్యు నల్‌లో డంపింగ్ యార్డ్ మూసివేయండని ఫిర్యాదు చేసిన కూడా రాంకీ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టించుకోని పీసీబీ అధికారులు..
కాజీపల్లి పారిశ్రామికవాడకు ఆనుకొని ఉన్న గాగిల్లాపూర్, దుండిగల్ తండా-2, గిరిజన ప్రాంతాల ప్రజలు కంపెనీ కెమికల్ వ్యర్థాలను అక్కడే డంపింగ్ చేయడం వల్ల అనారోగ్యాల భారినపడుతున్నారు. పీసీబీ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. పీసీబీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని రాంకీపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తండా ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మాజీ కౌన్సిలర్ హెచ్చరించారు.