డిసెంబర్ 16 రికార్డు తేదీ
హైదరాబాద్( విజయక్రాంతి): పీసీ జ్యూయలర్స్ లిమిటెడ్ భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల రిటైల్ చైన్లలో ఒకటిగా పేరు పొందింది. ఈ సంస్థ తన ఈక్విటీ షేర్లను 1:10 నిష్పత్తిలో విభజన/స్పిట్ చేయనున్నట్లు, 2024 డిసెంబర్ 16ను రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు ప్రకటించింది. దీని ప్రకారం, ఒక ఈక్విటీ షేర్ 10 ఈక్విటీ షేర్లుగా విభజించబడుతుంది.ఇటీవల, కంపెనీ 3,38,85,000 వారెంట్లను ‘నాన్-ప్రమోటర్, పబ్లిక్ క్యాటగిరీ’కి చెందిన 35 అలాటీలకు ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసింది.
ఈ ప్రక్రియలో, ఒక్కొక్క వారెంట్‌ను రూ. 42.15 ధరతో (ఇష్యూ ధరలో 75శాతం) మార్చి, మొత్తం రూ. 142.82 కోట్లను అందుకుంది. కాగా 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్ధ సంవత్సరానికి గాను సంస్థ అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది.2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వినియోగదారుల డిమాండ్, వినియోగదారుల సందర్శన మెరుగయ్యాయి. దీని ప్రభావం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో స్పష్టంగా కనిపించింది.
కంపెనీ రూ. 505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది ఏడాది వార్షిక ప్రాతిపదికన 1430 శాతం వృద్ధిని సూచిస్తుంది.గత ఏడాదితో పోలిస్తే 2025 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో ఆదాయం 797 శాతం వృద్ధితో రూ. 906 కోట్లకు చేరుకుంది. అలాగే, బ్యాంకులతో స్నేహపూర్వకంగా సమస్యలు పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా 14 బ్యాంకుల కన్సార్టియం సంస్థ ఆఫర్ ఫర్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ప్రతిపాదనను ఆమోదించింది.
సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం కంపెనీ అవసరమైన నగదు మొత్తం కొంత భాగాన్ని చెల్లించింది. దీనికి ప్రధానంగా ప్రమోటర్ గ్రూప్ ద్వారా ఫుల్-కన్వర్టబుల్ వారంట్ల రూపంలో నిధులు సమకూర్చబడ్డాయి. పీసీ జ్యూయలర్స్ లిమిటెడ్ 2005లో న్యూఢిల్లీ, కరోల్ బాగ్‌లో తన తొలి షోరూమ్ ప్రారంభం ద్వారా తన ప్రయాణాన్ని ఆరంభించింది. విభిన్న డిజైన్, ఆకర్షణీయత, శైలి ద్వారా ఆభరణాలను తిరిగి నిర్వచించడమే సంస్థ లక్ష్యం. ప్రస్తుతం, 17 రాష్ట్రాల్లో ఉన్న అనేక నగరాలలో షోరూమ్‌లతో భారతదేశంలో అతి వేగంగా పెరుగుతున్న ఆభరణాల చైన్‌గా నిలిచింది.