calender_icon.png 30 October, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతా వెళ్లిన పీసీ ఘోష్

30-10-2024 12:31:07 AM

దీపావళి తరువాతే కాళేశ్వరం విచారణ

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఏకసభ్య కమిషన్ తన విచారణను వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం దీపావళి పండుగకు ఆయన స్వస్థలం కోల్‌కతా వెళ్లిపోయారు. విచారణ తిరిగి దీపావళి అనంతరం ప్రారంభం కానుంది.

ఇప్పటికే సాగునీటి పారుదల శాఖ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇం జినీర్లను రెండోసారి విచారించిన ఘోష్ కమిషన్.. దీపావళి తర్వాత ఐఏఎస్‌లను, గత ప్రభుత్వంలో ముఖ్య పదవుల్లో ఉన్న నేతలను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దీపావళి తర్వాత జరిగే ఘోష్ కమిషన్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.