calender_icon.png 23 January, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీ ఘోష్ కమిషన్ గడువు మరోసారి పెంపు

01-09-2024 12:33:12 AM

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాళేశ్వరంపై విచారణకు నియమిం చిన కమిషన్ గడువును రాష్ర్ట ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను సర్కారు గతంలో నియమించింది. విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కమిషన్ గడువును అక్టోబర్ 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.