న్యూఢిల్లీ, జూన్ 19: పేటీఎం బ్రాండ్‌తో పేమెంట్ సర్వీసుల్ని అందిస్తున్న ఒన్97 కమ్యూనికేషన్ నష్టాలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.840 కోట్లకు పెరిగాయి. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 358 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన నియంత్రణల కారణంగా పేటీఎం నష్టాలు పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 33.48 శాతం తగ్గుదలతో రూ.2,464 కోట్ల నుంచి రూ. 1,639 కోట్లకు చేరంది.
ఈ ఏడాది 12,000 నియామకాలు
తమ వృద్ధిని పెంచుకునేదిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని విప్రో చీఫ్ హెచ్‌ఆర్‌వో సౌరభ్ గోవిల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తాము ఆఫర్లు ఇచ్చిన వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. వారితో పాటు కొత్తగా ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ హైరింగ్ జరపాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. జూన్ 30నాటికి విప్రో రోల్స్‌లో 2,34,391 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలి త్రైమాసికంలో కొత్తగా 337 మంది జత అయ్యారు.