calender_icon.png 28 October, 2024 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 ఏళ్లు పనిచేస్తే ఫలితం గిదా..

28-10-2024 05:21:31 PM

ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ ఇవ్వాల్సిందే 

పనికి తగిన వేతనం ఇవ్వకుంటే ఎలా.. కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లు

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వానికి నిరుపేదలకు వారధిగా ఉండి నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ వారి యోగక్షేమాలను చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లైన తాము 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫలితం ఏముందని తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కి ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సోమవారం వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేస్కేలు ఇవ్వాలని కనీస వేతనాల ప్రకారం రూ. 26000 జీతం అమలు పరచాలని, సర్కులర్ నెంబర్ 47 79 ని వెంటనే ఉపసంహరించాలని, లిస్టు మూడు లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణ వారు సమీక్షించుకున్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు కిళ్ళే గోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు 2006 నుండి పనిచేస్తున్నారని 18 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డులు కలిగిన ప్రతి పేదవారికి ఉపాధి హామీ పనులు అమలు చేయిస్తున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని తెలియజేశారు.

ప్రభుత్వాలు మారిన వీరి బతుకులు మారలేదని వారు వాపోయారు, గత ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ లను నిర్లక్ష్యం చేసిందని, ఏ సమస్య పరిష్కారం చేయకుండా, పైగా 4779 ద్వారా లెక్కించి పర్సంటేజ్ ప్రకారం జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చిందని, దీనివల్ల వేతనాలు తగ్గిపోయి 8700 నుంచి 11,500 మధ్య మాత్రమే వేతనాలు పొందుతున్నారన్నారు.

18 సంవత్సరాలు పనిచేసిన వీరికి 10,000 కూడా వేతనం ఇవ్వడం లేదని వారు బాధ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో జీతాలు పెంచుతామని ఉద్యోగ భద్ర కలిపిస్తామని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, 11 నెలలు గడుస్తున్నా వేతనాలు పెంచకపోవడం బాధాకరమైన విషయమని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో యూనియన్ జిల్లా అధ్యక్షులు అంజయ్య, చంద్రశేఖర్ గౌడ్ హుస్సేన్ అప్ప, వెంకట్ నాయక్, రాజ్ కుమార్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.