ఘణంగా కాళోజీ నారాయణరావు 110వ జయంతి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజా కవి కాళోజీ నారాణరావు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కాళోజీ నారాయణరావు 110 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడమే కాళోజీ నారాణరావు నిజమైన నివాళులు అని చెప్పారు. నిజాం నవాబు నిరంకుశానికి వ్యతిరేకంగా సామాన్య మానవునికి సైతం అర్థం అయ్యే రీతిలో ఎన్నో కవిత్వాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి అని కొనియాడారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, మార్కెట్ యార్డు చైర్మన్ బి. శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.