calender_icon.png 5 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతులకు మార్కెట్ ధర చెల్లింపు

02-01-2025 06:29:45 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వెళ్తున్న జాతీయ రహదారి మంచిర్యాల నుండి వరంగల్ వరకు వయా భూపాలపల్లి మీదుగా నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ మంగిలాల్, భూసేకరణ విభాగం పర్యవేక్షకులు, మురళీధర్, మొగుల్లపల్లి, టేకుమట్ల, చిట్యాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్బిట్రేషన్ ద్వారా రైతుల అభీష్టం, మేరకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్బిట్రేషన్ ద్వారా సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపుకు జాతీయ రహదారుల శాఖ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, ఆర్డిఓ ద్వారా చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉన్న రైతులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేయాలని సూచించారు. ఇతర గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి పరిహారపు ధర నిర్ణయించనున్నట్లు  కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.