calender_icon.png 14 January, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాయల్ శంకర్ x జోగు రామన్న

31-10-2024 12:06:29 AM

  1. పత్తి మద్దతు ధరకు పొలిటికల్ రంగు!
  2. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఆదిలాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటున్నది. మద్దతు ధర అంశం చిలికి చిలికి గాలివానవుతున్నది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది.

కేంద్ర (బీజేపీ), రాష్ట్ర ప్రభుత్వాలు (కాంగ్రెస్) పత్తి మద్దతు ధర విషయంలో రైతులను మోసం చేస్తున్నాయని జోగు రామన్న విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తికి మంచి మద్దతు ధర ఇస్తుండ గా, తెలంగాణ పత్తి రైతులకు మాత్రం తక్కు వ ధర ఇస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో దేశంలోనే నాణ్యమైన పత్తి పండుతుందని, కానీ, ఇక్కడి రైతులకు ఆశించిన మేర రేటు దక్కడం లేదంటున్నా రు. గుజరాత్‌లో కింటా పత్తికి రూ.8,800 మద్దతు ధర ఉండగా, తెలంగాణలో మాత్రం రూ.7,521 పలకడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశాన్ని ఇప్పటికే ఆయన కలెక్టర్, సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. దీంతో పత్తి మద్దతు ధర అంశం బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది.

పోటాపోటీగా మీడియా సమావేశాలు

పత్తి మద్దతు అంశాన్ని మాజీ మంత్రి జోగు రామన్న సీరియస్‌గా తీసుకుని ఆదిలాబాద్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రప్పించి పోరుబాటకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మె ల్యే పాయల్ శంకర్ కూడా బీఆర్‌ఎస్‌కు ప్రతి సవాల్ విసురుతున్నారు. గుజరాత్ పత్తికి మద్దతు ధర రూ.8,800 అందుతున్నదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయడానికి సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు.

ఈ మేరకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి, అవసరమైతే బీఆర్‌ఎస్ నేతలను సొంత ఖర్చులతో గుజరాత్‌కు తీసుకెళ్తానని, అందుకు సిద్ధమేనా అని.. మాజీ మంత్రి జోగు రామన్నను ప్రశ్నించా రు. మరోవైపు జోగు రామన్న కూడా మీడి యా సమావేశం నిర్వహించారు.

పత్తికి ఏ రాష్ట్రంలో ఎంత మద్దతు ధర ఉందో ఎమ్మె ల్యే  తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు మద్దతు ధర కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే, పార్టీ సమావేశాలతో పేరుతో హైదరాబాద్‌లో ఉండే ఎమ్మె ల్యేకు రైతుల బాధలు ఏం తెలుస్తాయని మండిపడ్డారు.