28-04-2025 05:51:28 PM
జిల్లా కలెక్టర్ గా పని చేసిన రోజులను నెమరువేసుకున్న ఎమ్మెల్యే...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(State Government Chief Secretary Ramakrishna Rao)ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో సోమవారం ప్రధాన కార్యదర్శి ని కలిసిన ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు కలెక్టర్ గా వరదల సమయంలో ద్విచక్రవాహనంపై తిరిగి జిల్లా ప్రజల్లో ఎంతో ధైర్యం నింపారని ఎమ్మెల్యే పాత రోజులను నెమరు వేసుకున్నారు. తాను సర్పంచ్ గా ఉన్నపుడు కలెక్టర్ గా పనిచేసిన రామకృష్ణరావు సేవలను కొనియాడారు. జిల్లాలో పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.