calender_icon.png 1 April, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించండి

27-03-2025 12:29:31 AM

  • పన్ను వడ్డీ పై 90% రాయితీ పొందండి

మున్సిపల్ కమిషనర్ తిరుపతి 

అందోల్, మార్చి 26 :ఆందోల్ - జోగిపేట మున్సిపల్ పురపాలక సంఘం లొ ఆస్తి పన్ను బకాయిలపై విధించబడిన వడ్డీలో 90% మాఫీ చేస్తూ, ఆస్తి పన్ను బకాయిదారులందరికీ వెసులుబాటు కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలలో ఈ అవకాశం వర్తించేలా ఓటిఎస్ స్కీం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులందరూ చెల్లించవలసి ఉన్న మొత్తం ఆస్తి పన్నులు వెంటనే చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.