calender_icon.png 25 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ జీతాలు ఇప్పించండి

25-02-2025 12:00:26 AM

సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 24: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్  జీతాలు ఇంపించాలని కోరుతూ  సచివాలయం ఉద్యోగుల అధ్య క్షులు శ్రీగిరి శ్రీనివాస్ రెడ్డి నీ కోరారు. సోమ వారం సచివాలయంలో శ్రీనివాస్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూషన్ జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సాను కూలంగా స్పందించిన సంబంధిత అధికా రులతో మాట్లాడి సత్వరమే సమస్యల పరిష్కారంలో సచివాలయ ఉద్యోగులుగా మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ పుల్లగొర్ల రాజిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పొన్నముల యాదగిరి, ప్రధాన కార్యదర్శి రాజమల్లు, డివిజన్ కార్యదర్శి నవీన్,  ప్రతినిధులు సాయిబాబా, రాజు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.