పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవ్, టీఎస్‌జీఎల్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులన్నీ గత ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. బిల్లులు విడు దలకాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల కు కనీస వేతనం(ఎంటీఎస్) అమలు చేయాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేస్తూ రెండో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. గురుకుల పాఠశాలల టైంటేబుల్ విద్యార్థుల సౌకర్యానికి అనుగుణంగా మార్పు చేయాలని, మాడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని కోరా రు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, నాయకులు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.