- ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తాం
- త్వరలో ఇందుకోసం షెడ్యూల్ ప్రకటిస్తాం
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి
ఖమ్మం, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలకు ప్రభుత్వం త్వ రలో షెడ్యూల్ ప్రకటిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న బాకీలు రైతు చెల్లిస్తే.. రూ.౨ లక్షల రుణమాఫీ నిధులు ప్రభుత్వం వి డుదల చేస్తుందని చెప్పారు.
రఘునాధపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం మంత్రి పర్యటించారు. రజబ్‌ఆలీనగర్, ఎన్వీ బంజర, పంగిడి గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రై న్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉ న్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గుడిసెలు, రేకుల షెడ్డుల్లో ఉన్న వారి వివరాలు అందజేస్తే, వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. పోడు భూముల పట్టాలు పొందిన రైతుల పొలాల్లో వేసుకున్న బోర్లకు విద్యుత్ కనెక్షన్ అందజేసేందుకు అనుమతులు జారీ చేయాలని అధికారు లను ఆదేశించారు.
సర్వే జరిగి, మిగిలిన పోడు భూములకు పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.