25-03-2025 12:00:00 AM
టీఎస్ యుటిఎఫ్ డిమాండ్
ముషీరాబాద్, మార్చి 24, (విజయక్రాంతి) : ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు,11 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు ఫిబ్రవరి నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేష న్ (టీఎస్ యుటిఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 010 పద్దు కింద వేతనాలు పొందే ఉద్యోగులకు మాత్రమే ప్రతినెలా 1 వ తేదీన వేతనాలు విడుదల చేస్తున్నప్పటికీ ఇతర ఉద్యోగులకు మాత్రం వేతనాల చెల్లింపుకు నిర్దిష్ట తేదీ ఉండటం లేదని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, ఎ. వెంకట్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన రామకృష్ణ రావుకు వినతి పత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న ఎయిడెడ్, మోడల్ స్కూల్స్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల జనవరి, ఫిబ్రవరి వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుచేశారు.